Sunday, December 22, 2024

నిషేధం ఉన్నా ఢిల్లీలో పెరగనున్న టపాసుల మోత

- Advertisement -
- Advertisement -

Firecracker ban in delhi

 

న్యూఢిల్లీ: దీపావళి పండుగ నాడు ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్‌సిఆర్)లో గడచిన ఐదేళ్లతో పోలిస్తే ఈ ఏడాది ప్రజలు అత్యధికంగా బాణసంచా కాల్చనున్నట్లు ఒక సర్వే చెబుతోంది. ఈ ప్రాంతాలలో నివసించే ప్రతి ఐదు కుటుంబాలలో రెండు కుటుంబాలు పండుగ నాడు టపాసులు కాల్చేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు సర్వేలో తేలింది. లోకల్ సర్కిల్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్ జిల్లాల్లో నివసించే 10 వేల మంది పాల్గొనగా వీరిలో 10 శాతం మంది తాము ఇప్పటికే ఢిల్లీలోని దుకాణాల నుంచి బాణసంచా కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఎన్‌సిఆర్‌లోని ఇతర నగరాల నుంచి బాణసంచా కొనుగోలు చేసినట్లు మరో 20 శాతం మంది వెల్లడించారు.

కాలుష్యం కారణంగానో లేక ప్రభుత్వం విధించిన నిషేధానికి లోబడో మరో 61 శాతం మంది మాత్రం తాము టపాసులకు దూరంగా ఉంటామని తెలియచేశారు. అయితే..2018 నుంచి అమలులో ఉన్న బాణసంచా నిషేధం అమలు జరుగుతున్న తీరును చూస్తే ఈ ఏడాది ఎక్కువగానే దీని వినియోగం ఉండవచ్చని తెలుస్తోంది. 2018లో 32 శాతం కుటుంబాలు టపాసులు ఉపయోగించగా 2019లో ఇది 35 శాతానికి పెరిగింది. రెండవ కొవిడ్ ఉధృతి తర్వాత 2021లో ఇది మళ్లీ 32 శాతానికి చేరుకోగాఈ ఏడాది ఢిల్లీ మినహాయించి ఇతర ఎన్‌సిఆర్ నగరాలలో టపాసుల వాడకంపై నిషేధం లేకపోవడంతో ఈ దీపావళికి 39 శాతం కుటుంబాలు బాణసంచా కాల్చవచ్చని సర్వే చెబుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News