Sunday, April 6, 2025

బాణసంచా గిడ్డంగిలో పేలుడు… 21కి పెరిగిన మృతులు

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రం బనాస్‌కాంఠా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దిసా పట్టణం శివారులోని ఓ బాణ సంచా గిడ్డంగిలో పేలుడు సంభవించడంతో మృతుల సంఖ్య 21కి పెరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడడంతో ఆస్పత్రులకు తరలించారు. మృతుల్లో అయిదుగురు చిన్నారులు ఉన్నారు. పేలుడు ధాటికి పైకప్పుడు కూలిపోవడంతో పలువురు కార్మికులు, కుటుంబ సభ్యులు చిక్కుకు పోయారు. పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బాణసంచా నిల్వ చేయడంతో పాటు అక్రమంగా తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బాధితులు మధ్య ప్రదేశ్‌కు చెందిన వారని పోలీసులు ప్రకటించారు. గిడ్డంగి యజమానిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News