Thursday, December 26, 2024

నేడు ఫైర్‌మెన్ పాసింగ్ ఔట్ పరేడ్

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 483 మంది ఫైర్ మెన్ల పాసింగ్ ఔట్ పరేడ్ శుక్రవారం నిర్వహించనున్నారు. వట్టినాగులపల్లిలోని తెలంగాణ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సేవల శాఖ శిక్షణ కేంద్రంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియమితులైన ఈ 483 మందికి వట్టినాగులపల్లిలోని శిక్షణ కేంద్రంలో నాలుగు నెలల పాటు వరదలు, భూ కంపాలు, విపత్తులు, అగ్ని ప్రమాదాలు, రోడ్డు, రైలు, విమాన ప్రమాద సమయాల్లో సహాయక చర్యలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం ఇటీవల ఎంపికైన 157 మంది డిఓపి (డ్రైవర్ ఆపరేటర్ల)కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News