Saturday, December 28, 2024

రైలు బోగీలలో చెలరేగిన మంటలు

- Advertisement -
- Advertisement -

రత్లామ్ : మధ్యప్రదేశ్‌లో ఆదివారం రైలు ప్రయాణికులకు ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. రట్లామ్ అంబేద్కర్ నగర్ డెమూ రైలుకు చెందిన రెండు బోగీలకు నిప్పంటుకుంది. ముందుగా రైలు మోటార్ కోచ్ క్యాబ్‌లో వెలువడ్డ మంటలు తరువాతి కోచ్‌కు వ్యాపించినట్లు, ఇందులో ప్రయాణికులు ఉండటంతో కలవరం చెలరేగినట్లు వెల్లడైంది. అయితే వెంటనే రైలును నిలిపివేసి మంటలు ఆర్పివేయడంతో ప్రయాణికులకు సిబ్బందికి ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. రత్లామ్ స్టేషన్‌కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలోని ప్రీతమ్ నగర్ స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది.

డ్రైవింగ్ మోటార్‌కోచ్‌లో సాంకేతిక సమస్యలతో మంటలు వెలువడ్డట్లు ప్రాధమిక విశ్లేషణలో వెల్లడైంది. ఉదయం ఏడుగంటలకు ప్రమాదం జరిగింది. అగ్నిమాపక శకటాలు వచ్చి గంట సేపు శ్రమించిన మీదట మంటలు చల్లారాయి. తరువాత ప్రయాణికులను వేరే రత్లామ్ నుంచి ఇండోర్‌కు పంపించారు. ఘటన వల్ల ఈ మార్గంలో ఇతర రైళ్ల ప్రయాణాలకు ఎటువంటి ఇబ్బంది ఏర్పడలేదని రైల్వే సమాచార శాఖ ప్రకటన వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News