Thursday, January 23, 2025

ఢిల్లీ రైల్వే గోడౌన్‌లో మంటలు

- Advertisement -
- Advertisement -

Fires in Delhi Railway godown

న్యూఢిల్లీ : స్థానిక రైల్వే గోడౌన్‌లో ఆదివారం సాయంత్రం మంటలు అంటుకున్నాయి. దీనితో ఈ ప్రాంతం అంతా దట్టమైన పొగలతో కారుమబ్బులు కమ్ముకున్నాయి. ఇక్కడి ప్రతాప్ నగర్ మెట్రో రైల్వేస్టేషన్ సమీపంలోని సబ్జి మండి వద్ద ఈ రైల్వే గోడౌన్ ఉంది. ఇందులో అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియడం లేదు. ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదం గురించి తమకు నాలుగున్నర గంటలకు మంటల గురించి సమాచారం అందిందని వెంటనే అక్కడికి 14అగ్నిమాపక శకటాలు వెళ్లాయని ఢిల్లీ ఫైర్ సర్వీసు డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. మంటలను అదుపులోకి తెచ్చామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News