Friday, January 24, 2025

కేరళలో బాణసంచా పేలుడు: 150 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: కేరళ రాష్ట్రం కాసర్‌గోడ్ ప్రాంతం ఓ ఆలయంలో ఉత్సవం జరుగుతుండగా బాణసంచా ఫ్యాక్టరీలో పేలుళ్లు జరిగాయి. ఈ ప్రమాదంలో 150 మంది గాయపడగా 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అంజోతంబలం వీరర్కపు ఆలయంలో కాళియాట్లం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయానికి కూతవేటు దూరంలోనే బాణసంచా ఫ్యాక్టరీ ఉంది. బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో పెద్దు ఎత్తున మంటలు చెలరేగాయి. ఉత్సవానికి వచ్చిన భక్తులకు మంటలు అంటుకోవడంతో 150 మందిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News