Sunday, January 19, 2025

పూరీలో బాణాసంచా పేలుడు.. ఒకరు మృతి, 15మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్‌: ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీలో బాణాసంచా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో 15 మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం రాత్రి పూరీలోని నరేంద్ర పుష్కరిణిలో నిర్వహించిన జగన్నాథుడి చందన జాతర కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చారు. జాతరలో భాగంగా కొందరు భక్తులు పటాసులు పేల్చారు.

ప్రమాదవశాత్తు ఆ నిప్పురవ్వలు సమీపంలో బాణసంచా నిల్వ ఉంచిన ప్రాంతంలో పడ్డాయి. దీంతో పెద్దఎత్తున పేలుడు సంభవించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News