Monday, December 23, 2024

ఇంట్లో బాణసంచా నిల్వలు… అగ్నిప్రమాదంలో దంపతుల మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యాకుత్‌పురాలోని బాణసంచాకు మంటలు అంటుకోవడంతో అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లో ఉంచిన బాణసంచాకు మంటలు అంటుకోవడంతో దంపతులు మృతి చెందారు. దంపతుల కూతురు కూడా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. బాలిక యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఉషారాణి, మోహన్‌లాల్ అనే దంపతులు బాణాసంచా దుకాణం నిర్వహిస్తున్నారు. దుకాణం నుంచి కొన్ని బాణాసంచాలను ఇంట్లో భద్రపరిచారు. ఇంట్లో పిండి వంటకాలు చేస్తుండగా బాణసంచాకు నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. నివాసం ఉంటున్న ఇండ్లలో బాణాసంచా నిల్వలు ఉంచుకోవద్దని పోలీస్ శాఖ పలుమార్లు ప్రజలను హెచ్చరించినప్పటికి వారు పటించుకోవడంలేదని పోలీసులు వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News