Thursday, December 19, 2024

శామీర్‌పేట్ సెలబ్రిటీ క్లబ్‌లో కాల్పుల కలకలం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః నగరంలోని శామీర్‌పేట్ సెలబ్రిటీ క్లబ్‌లో కాల్పులు కలకలం రేపాయి. వివాహేతర సంబంధం కాల్పులకు దారితీసినట్లు తెలుస్తోంది. సెలబ్రిటీ క్లబ్‌లోని విల్లాలో ఓ వ్యక్తితో తన భార్య ఉందనే విషయాన్ని తెలుసుకున్న భర్త విల్లాకు వెళ్లాడు. వేరే వ్యక్తితో భార్యను చూసిన భర్త.. ఇద్దరు మధ్య సంబంధంపై నిలదీశాడు. దీంతో ఆ వ్యక్తి, భర్తపై ఎయిర్ గన్‌తో కాల్పులు జరిపినట్లు సమాచారం.

అక్కడి నుంచి తప్పించుకున్న భర్త, శామీర్‌పేట పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య, ఆమె ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News