Wednesday, January 22, 2025

పంజాబ్‌లో నీటి కోసం కాల్పులు: నలుగురి మృతి

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: పొలాలకు నీటిని మళ్లించే విషయంలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చెలరేగి చివరకు కాల్పులకు దారితీయడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా బటాలాలో ఆదివారం రాత్రి జరిగినట్లు పోలీసులు తెలిపారు. శ్రీహర్‌గోబింద్‌ఫూర్‌లోని లిఘన్‌వాలా చౌక్ వద్ద రెండు గ్రూపులు ఘర్షణ పడినట్లు వారు చెప్పారు. పరస్పరం జరుపుకున్న కాల్పులలో రెండు గ్రూపులలోని ఇద్దరేసి వ్యక్తుల చొప్పున మరణించారు.

ఈ ఘటనలో మరో 8 మంది గాయపడి అమృత్‌సర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. పొలాలకు సాగునీరును అందించే కాల్వ నుంచి నీటిని మళ్లించుకునే విషయంలో మేజర్ సింగ్, అంగ్రీజ్ సింగ్ వర్గాల మధ్య గొడవ జరిగింది. ఒక గ్రూపులో 9 మంది ఉండగా మరో గ్రూపులో నలుగురు వ్యక్తులు ఉన్నారు.ఈ ఘటన గురించి తెలుసుకున్న వెంటనే పోలీసు బలగాలు హుటాహుటిన గ్రామాన్ని చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనలో ఎస్‌ఎస్‌ఓ వాహనాన్ని కూడా బుల్లెట్ తాకినట్లు పోలీసులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News