Thursday, January 23, 2025

పల్నాడులో కాల్పుల కలకలం

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పుల కలకలం సృష్టించాయి. రొంపిచర్ల మండలం టిడిపి అధ్యక్షుడు బాలకోటి రెడ్డిపై ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. ఇంట్లో ఉన్న సమయంలో ప్రత్యర్థులు తుపాకీతో రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బాలకోటి రెడ్డికి తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. టిడిపి నేత పమ్మి వెంకటేశ్వర రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టిడిపిలో అంతర్గత విభేదాలే కాల్పులకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News