Monday, December 23, 2024

దారుణ ఘటన.. పట్టపగలే కాలేజీ విద్యార్థిని కాల్చివేత..

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సోమవారం పట్టపగలు అంతా చూస్తూ ఉండగానే ఓ యువతిని బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతి సమీపం నుంచి గన్‌తో కాల్చి చంపారు. జలౌన్ జిల్లాలో కాలేజీ పరీక్ష రాసి వెళ్లుతున్న అమ్మాయిపై దాడి జరిగింది. దుండగులు గన్‌ను అక్కడనే వదిలి బైక్‌పై పారిపొయ్యారు. జిల్లాలోని ఐత్ లో స్థానిక పోలీసు స్టేషన్‌కు కేవలం 200 మీటర్ల దూరంలోనే ఈ దారుణం జరిగింది. బిఎ చదువుతున్న 21 ఏండ్ల రోషిణి అహిర్వార్ రామ్ లఖన్ పటేల్ మహావిద్యాలయలో పరీక్ష రాసి బయటకు వచ్చింది. ఈమెను బజాజ్ పల్సర్ బైక్‌పై ఉన్న దుండగులు గమనించి నాటు పిస్టల్‌తో కాల్పులకు దిగినట్లు వెల్లడైంది. తలపై గురి చూసి బుల్లెటు పేల్చడంతో ఆ యువతి కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. దుండగులు తమ చేతుల్లోని గన్‌ను అక్కడనే పడేసి వెళ్లినట్లు తెలిసింది.

Also Read: ఆ నలుగురు జవాన్లను కాల్చింది సైనికుడే..

ఘటనకు సంబంధించి యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజ్ అహిర్వార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విచారణకు తీసుకువెళ్లారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై నిరసన వ్యక్తం అయింది. అతీక్ అహ్మద్ కాల్చివేతపై గోడీ మీడియా తోడేళ్ల, బిజెపి సంబరాలు చేసుకున్నారు. సరే ఇప్పుడు ఈ కాలేజీ విద్యార్థిని దిక్కులేని చావుపై కూడా పండుగ చేసుకుంటారా? యోగి ఘనత అని చెపుతారా? అని రాష్ట్రీయ జనతాదళ్ ట్వీటు వెలువరించింది. రోడ్డుపై నెత్తుటి మడుగులో పడి ఉన్న యువతి భౌతికకాయం దృశ్యాన్ని జతపర్చింది. మోడీకి వంతపాడే మీడియాకు గతంలో ఓ జర్నలిస్టు ఈ గోడీ మీడియా అనే వ్యంగ్య విశేషణ నామం పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News