Tuesday, April 1, 2025

తోటి జవాన్లపై కాల్పులు.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

జవాన్ల మధ్య గొడవ జరిగి ఒకరు మృతి చెందారు.ఈ విషాద ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. బలరాంపూర్ జిల్లాలోని బూతాహీ పోలీస్ క్యాంప్‌లో సీఏఎఫ్‌ ఛత్తీస్‌గఢ్‌ ఆర్మ్డ్ ఫోర్స్‌కు చెందిన జవాన్ల మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో ఓ జవాన్‌ కోపంతో తన తోటి జవాన్లపై కాల్పులు జరిపాడు.

ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఓ జవాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్పీ రాజేష్ అగర్వాల్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించి దర్యాప్తు ఆదేశించారు. అయితే కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News