Sunday, September 8, 2024

పిఓకెలో నిరసనకారులపై కాల్పులు.. ముగ్గురి మృతి: ఆరుగురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

పిఒకెలో నిరసనకారులపై తూటాలు

భద్రత బలగాల కాల్పుల్లో
ముగ్గురు మృతి విద్యుత్
బిల్లుల పెంపు, గోధుమపిండి
ధరలకు వ్యతిరేకంగా
నిరసనలతో అట్టుడుకుతున్న
పాక్ అక్రమిత కశ్మీర్

ఇస్లామాబాద్: గోధుమ పిండి ధరలు, విద్యుత్ బిల్లుల పెంపునకు వ్యతిరేకం గా ప్రజా నిరసనలతో అట్టుడుకుతున్న పాక్ ఆక్రమిత కశ్మీరులో(పిఓకె) మంగళవారం పారామిలిటరీ రేంజర్లపై దాడి చేసిన నిరసనకారులపై భద్రతా దళాలు జరిపిన కాల్పులలో ముగ్గురు మరణించగా మరో ఆరుగురు గాయపడ్డారు. వివాదాస్పద ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం వచ్చిన పారామిలిటరీ రేంజర్లు ప్రాంతీయ రాజధాని ముజఫరాబాద్ నుంచి వెళ్లిపోతుండగా వారిపై దాడి జరిగినట్లు ది డాన్ వార్తాపత్రిక తెలిపింది. ఖైబర్ పఖ్తూన్‌క్వా సరిహద్దులోని బ్రార్‌కోట్ గ్రామం మీదుగా వెళ్లకుండా ముజఫరాబాద్ సరిహద్దులోని కోహలా మీదుగా నిష్కమిస్తున్న రేంజర్లకు చెందిన 19 వాహనాల కాన్వాయ్‌పై నిరసనకారులు దాడి జరిపినట్లు పత్రిక తెలిపింది. నక్క గ్రామం వద్ద కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరగగా రేంజర్లు బాష్పవాయు గోళాలు, కాల్పులతో సమాధానమిచ్చారని పత్రిక పేర్కొంది. ముజఫరాబాద్ -బ్రార్‌కోట్ రోడ్డుపైన రేంజర్లకు చెందిన మూడు వాహనాలకు నిరసనకారులు నిప్పుపెట్టినట్లు మీడియా వార్తలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News