Wednesday, January 22, 2025

బీహార్‌లో తెలంగాణ పోలీసులపై కాల్పులు

- Advertisement -
- Advertisement -

Firing on Telangana Police in Bihar

మన తెలంగాణ/హైదరాబాద్: బీహార్‌లో తెలంగాణ పోలీసులపై సైబర్ నేరగాళ్లు కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే వాహన కంపెనీల ఫ్రాంచైజీల పేరిట సైబర్ మోసాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న నిందితులను పట్టుకునేందుకు తెలంగాణ పోలీసులు బీహార్ వెళ్లాను. నవాడా జిల్లాలోని భవానిబిగా గ్రామంలో నిందితుల ఆచూకీ గుర్తించారు. స్థానిక పోలీసుల సాయంతో నిందితులను పట్టుకునే క్రమంలో ప్రధాన నిందితుడు మితిలేష్ ప్రసాద్ పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకున్నాడు. మిగిలిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.1.22 కోట్ల నగదు, మూడు కార్లు, ఐదు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. అయితే, కాల్పుల ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరిచి పిటి వారెంట్‌పై నగరానికి తీసుకురానున్నట్లు పోలీసులు తెలిపారు.

Firing on Telangana Police in Bihar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News