Monday, January 6, 2025

విమానం ల్యాండ్ అవుతుండగా కాల్పులు

- Advertisement -
- Advertisement -

విమానాశ్రయం మూసివేత
విమానానికి తగిలిన బుల్లెట్లు: సిబ్బందికి గాయాలు
గ్యాంగ్‌వార్‌తో అట్టుడుకుతున్న హైతీ
పోర్ట్ ఔ ప్రిన్స్(హైతీ): విమానాశ్రయంలో దిగుతున్న ఒక విమానంపై కొంత మంది దుండగులు కాల్పులు జరిపారు. విమానానికి బుల్లెట్లు తగలడంతో పైలట్ అక్కడ ల్యాండ్ చేయకుండా పక్కనే ఉన్న మరొక దేశానికి మళ్లించాడు. భద్రంగా ల్యాండ్ అయిన తరువాత చూస్తే విమానం బయట పలు చోట్ల బుల్లెట్లు తగిలి దెబ్బ తినడం కనిపించింది. విమానంలోని సిబ్బంది ఒకరు స్వల్పంగా గాయపడ్డారు. కరీబియన్ దేశంహైతీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఘటన అనంతరం హైతీ అంతర్జాతీయ విమానాశ్రయాన్యిన సోమవారం మూసివేశారు. దీనితో కొన్ని విమానయాన సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి. దేశంలో మధ్యంతర ప్రధాని అలిక్స్ దీదియర్ ఫిల్స్ ఎయిమి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో ప్రశాంతత పునరుద్ధరణకు కృషి చేస్తానని ఆయన వాగ్దానం చేశారు. హైతీలో గ్యాంగ్‌వార్ ముదరడంతో దేశం అట్టుడుకుతోందని, ఈ క్రమంలోనే దుండగులు విమానంపైకి కాల్పులు జరిపారని అధికారులు తెలియజేశారు. స్పిరిట్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఒక ఫ్లైట్ ఫ్లోరిడా నుంచి హైతీకి బయలుదేరింది.

సోమవారం ఉదయం హైతీ రాజధాని పోర్ట్ ఔ ప్రిన్స్‌లో విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించాడు. దాదాపు వంద అడుగుల ఎత్తుకు చేరుకున్న తరువాత అకస్మాత్తుగా భూమి మీద నుంచి విమానంపైకి కాల్పులు జరిగాయి. బుల్లెట్లు తగిలి విమానం దెబ్బ తిన్నది. దీనితో విమానాన్ని మళ్లీ పైకి లేపిన పైలట్ హైతీకి పొరుగున ఉన్న డొమినికన్ రిపబ్లిక్‌కు మళ్లించాడు. అక్కడ భద్రంగా దించిన తరువాత చూస్తే విమానం బయట లోపల బుల్లెట్లు తగిలిని గుర్తులు కనిపించాయి. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News