Friday, December 20, 2024

రాహుల్‌ గాంధీపై ఛత్తీస్‌గఢ్‌లో మూడు ఎఫ్‌ఐఆర్‌లు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తన ఇటీవలి యుఎస్ పర్యటనలో చేసిన వ్యాఖ్యల ద్వారా సిక్కు సమాజం మత భావాలకు హాని కలిగించారనే ఆరోపణలపై ఛత్తీస్‌గఢ్‌లో వేర్వేరు ప్రాంతాల్లో ఆయనపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. రెండు కేసులు ఒకటి రాజధాని రాయిపూర్‌లోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లోను, మరొకటి బిలాస్‌పూర్ జిల్లాలో బిలాస్‌పూర్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లోను గురువారం దాఖలు కాగా, దుర్గ్ జిల్లాలో కొత్వాలీ పోలీస్ స్టేషన్‌లో ఒక ఎఫ్‌ఐఆర్‌ను శుక్రవారం నమోదు చేసినట్లు వారు తెలియజేశారు.బిజెపి నేతలు చేసిన ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు జరిగింది.

రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లలో అటువంటి ఫిర్యాదులను అధికార పార్టీ నేతలు సమర్పించారు. మూడు కేసుల్లోను భారతీయ న్యాయ సంహితలోని 299 (మత విశ్వాసాలను దెబ్బ తీయడం లేదా ఏదైనా వర్గం మత భావాలకు హాని కలిగించడం ధ్యేయంగా ఉద్దేశపూర్వకంగా, తప్పుడు పనులు), 302 (మాటలు, ధ్వనులు, సంజ్ఞలు, వస్తువుల ద్వారా ఒకరి మత భావనలను ఉద్దేశపూర్వకంగా గాయపరడం) సెక్షన్ల కింద రాహుల్‌ను బుక్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి అమర్‌జీత్ సింగ్‌ఛాబ్రా రాయిపూర్‌లోను, బిజెపి దుర్గ్ జిల్లా శాఖ అధ్యక్షుడు జితేంద్ర వర్మ దుర్గ్‌లోను ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News