Wednesday, January 22, 2025

భారత్ జోడో యాత్ర వార్షికోత్సవం: ఈ యాత్ర కొనసాగుతుంది

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారతదేశంలో విద్వేషాన్ని నిర్మూలించేవరకు, దేశాన్ని సమైక్యంగా ఉంచేంతవరకు తన యాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు.

గత ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు 4,000 కిలోమీటర్ల భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. భారత్ జోడో యాత్ర ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఎక్స్‌లో(ఇదివరకటి ట్విట్టర్) ఒక వీడియోను పోస్టు చేశారు. ఐక్యత, ప్రేమ కోసం భారత్ జోడో యాత్రకు సంబంధించిన కోట్లాది అడుగులు దేశానికి మెగుగైన భవిష్యత్తుకు పునాదిగా మారాయని రాహుల్ పేర్కొన్నారు. దేశంలో విద్వేషాన్ని నిర్మూలించి దేశం సమైక్యంగా ఉండేవరకు ఈ యాత్ర కొనసాగుతుందని, ఇదే తన వాగ్దానమని రాహుల్ పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర సందర్భంగా 12 బహిరంగ సభలు, 100కి పైగా వీధి చివరి సమావేశాలు, 13 విలేకరుల సమావేశాలలో మాట్లాడారు. 175కిపైగా నడక సంభాషణలు, 100కిపైగా భేటీలు నిర్వహించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News