- Advertisement -
విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు ముందుగా రాయలసీమ ప్రాంతంలోకి ప్రవేశించనున్నాయి. ఈ సారి నైరుతి రుతుపవనాలు జూన్ 4 నే రానున్నాయి. గత ఏడాది జూన్ 19కి వచ్చాయి. ఎల్ నినో కండిషన్లను న్యూట్రలైజ్డ్ చేయడం వల్ల నైరుతి రుతుపవనాలు మే 31నే కేరళను తాకబోతున్నాయని ఐఎండి అమరావతి తెలిపింది. కేరళకు చేరిన రెండు రోజుల తర్వాత నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించనున్నాయి.
ప్రస్తతం రాయలసీమలో ఉష్ణోగ్రత హెచ్చుగానే ఉంది. ఓంగోలులో అత్యధిక ఉష్ణోగ్రత 41.6 డిగ్రీలు, తిరుపతిలో 41.5 డిగ్రీల సెల్సియస్ గా ఉంది.
- Advertisement -