Monday, December 23, 2024

2031 నాటికి అంతరిక్షంలో తొలి శిశు జననం

- Advertisement -
- Advertisement -

అంతరిక్షంలోకి మానవుడు మొట్టమొదటిసారి 1961 లో ప్రవేశించిన దగ్గర నుంచి అంతరిక్షంలో సంతానోత్పత్తి మనిషికి సాధ్యమౌతుందా లేదా అన్న కోణంలో పరిశోధనలు జరుగుతున్నాయి. బ్రిటన్, నెదర్లాండ్ శాస్త్రవేత్తలు ఈ విషయంలో విజయం సాధిస్తామన్న నమ్మకంతో పరిశోధనలు చేస్తున్నారు. బ్రిటిష్ శాస్త్రవేత్తలు డచ్ కంపెనీ స్పేస్ బార్న్ యునైటెడ్‌తో కలిసి అంతరిక్షంలో కృత్రిమ గర్భధారణకు అవసరమైన సాంకేతిక మాడ్యూల్‌ను రూపొందిస్తున్నారు.

దీన్ని అసిస్టెడ్ రీప్రొడక్షన్ టెక్నాలజీ ఇన్ స్పేస్ (ఆర్ట్ ARTS) మాడ్యూల్ గా వ్యవహరిస్తున్నారు. ఈ మాడ్యూల్ లోపల ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ( IVF కృత్రిమ గర్భధారణ) చికిత్స ద్వారా పిండం తయారైన తరువాత దాన్ని భూమి మీదకు తీసుకొస్తారు. స్త్రీ గర్భం లోకి ఆ పిండాన్ని ప్రవేశ పెడతారు. ఈ విధంగా భూమిపై పురుడు పోసుకునే పిల్లలను స్పేస్ బేబీస్ ( SPACE BABIES ) అని పిలుస్తారు. ఇదెంతవరకు ప్రయోగాత్మకంగా సఫలమవుతుందో ముందుగా పరీక్షించడానికి ఎలుకలను ఎంచుకున్నారు. ఎలుకల శుక్ల కణాలను , గుడ్లను అంతరిక్షం లోకి తీసుకెళ్లి అక్కడ ఫలదీకరణ చేయిస్తారు. ఈ మాడ్యూల్ సాంకేతితను పరీక్షించే తొలి వ్యోమనౌక ఏప్రిల్ లో కెనడా నుంచి బయలుదేరుతుంది. ఈ ఐవీఎఫ్ ప్రయోగాన్ని నిర్వహించే బయో ఉపగ్రహం మరో 1824 నెలల్లో సిద్ధంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

స్పేస్‌బార్న్ సంస్థకు అస్గార్డియా కంపెనీ సహకరిస్తుంది. 2016 లో ఏర్పాటైన ఈ సంస్థ అంతరిక్షంలో తొలి మానవ నివాసాన్ని ఏర్పాటు చేయాలన్న లక్షంతో ప్రయత్నాలు చేస్తోంది. భూమి వెలుపల సంతానోత్పత్తిని చేయడమే లక్షంగా పెట్టుకున్నప్పటికీ మొదట అంతరిక్షంలో ఈమేరకు టెక్నాలజీని పరీక్షించవలసిన అవసరం ఉందని స్పేస్‌బోర్న్ సంస్థ సూచిస్తోంది. ఈ నేపథ్యంలో మానవ కణాలతో బయో ఉపగ్రహాలను రానున్న ఐదేళ్లలో అంతరిక్షం లోకి పంపే అవకాశం కలుగుతుందని ఆ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎగ్‌బర్ట్ అడెల్ బ్రూక్ వివరించారు. 2031 నాటికి అంతరిక్షంలో తొలి మానవ బిడ్డకు ప్రసవం జరుగుతుందన్న ఆశాభావం వెలిబుచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News