Monday, December 23, 2024

ముందు నిషేధం ఆర్‌ఎస్‌ఎస్‌పై విధించాలి

- Advertisement -
- Advertisement -

First ban should be imposed on RSS

ఆర్జేడీ నేత లాలూ వ్యాఖ్య ..బిజెపి నిరసన

పాట్నా : నిషేధం అంటూ విధిస్తే ముందుగా నిషేధించాల్సింది ఆర్‌ఎస్‌ఎస్‌ను అని రాష్ట్రీయ జనతాదళ్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. పిఎఫ్‌ఐ కన్నా ముందు సంఘ్‌పరివార్‌ను నిషేధజాబితాలోకి చేర్చాల్సి ఉందన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హిందువుల తీవ్రవాద సంస్థ అని పాట్నాలో లాలూ వ్యాఖ్యానించారు. ఉగ్రవాద కార్యకలాపాలు , విద్వేషచర్యలకు పాల్పడుతున్నారని పేర్కొంటూ పిఎఫ్‌ఐ, అనుబంధ సంస్థలపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ వేటుకు దిగింది. దీనిపై లాలూ తీవ్రంగానే స్పందించారు. ఆర్‌ఎస్‌ఎస్ కట్టర్‌పంత్‌గా పేరొందిందని, మరి ఇప్పుడు ఓ సంస్థను మత విద్వేషాల పేరిట నిషేధించినప్పుడు ఈ పరివార్‌పై ఎందుకు చర్య తీసుకోవడం లేదని లాలూ ప్రశ్నించారు. లాలూ వ్యాఖ్యలపై బిజెపి వెంటనే తీవ్రంగా స్పందించింది. మాజీ సిఎం ఓటుబ్యాంకు రాజకీయాలకు దిగుతున్నాడని విమర్శించింది. ఆర్జేడీ జాతీయ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలలో లాలూ నామినేషన్ వేసేందుకు ఢిల్లీకి వచ్చారు. లాంఛనప్రాయంగా వచ్చే నెలలో జరిగే ఎన్నికలలో లాలూ తిరిగి పార్టీ అధ్యక్షులు కానున్నారు. ఓట్ల కోసం లాలూ తన ముస్లిం మద్దతు మాటలకు దిగుతున్నారని, పిఎఫ్‌ఐను వెనకేసుకువస్తున్నారని బీహార్ బిజెపి అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ విమర్శించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News