టోక్యో: విశ్వ క్రీడలు ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు 88 మందితో కూడిన భారత తొలి బృందం జపాన్ చేరుకుంది. జపాన్ రాజధాని టోక్యో వేదికగా ఈనెల 23 నుంచి ఒలింపిక్స్ జరుగనున్నాయి. ఈ క్రీడల్లో భారత్ నుంచి మొత్తం 119 మంది క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు. అంతేగాక 109 మంది సహాయక సిబ్బంది, భార త ఒలింపిక్ సంఘం ప్రతినిధులు కూడా ఒలింపిక్స్‌కు హాజరవుతున్నారు. ఇదిలావుండగా వీరిలో మొదటి విడతగా 88 మందితో కూడిన బృందం ఆదివారం టోక్యో చేరుకుంది. వీరిలో 54 మంది అథ్లెట్లు ఉండగా మిగతావారు సహాయక సిబ్బంది ఉన్నారు. శనివారం రాత్రి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భారత బృందం జపాన్ బయలుదేరి వెళ్లింది.
కాగా, జపాన్‌లోని కురోబి సిటీ ప్రతినిధులు భారత అథ్లెట్లకు ఘన స్వాగతం పలికారు. కాగా తొలి విడతలో హాకీ, జూడో, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, టిటి, బ్యాడ్మింటన్, ఆర్చరీ, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారులు జపాన్ వెళ్లారు. మిగతా వారు త్వరలోనే బయలుదేరి వెళతారు. ఇదిలావుండగా జపాన్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో ప్రపం చవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన దాదాపు 18 వేల మంది అథ్లెట్లు, సహాయక సిబ్బంది పాల్గొంటున్నారు. కరోనా నేపథ్యంలో కఠిన ఆంక్షల మధ్య క్రీడలను నిర్వహిస్తున్నారు. ఈసారి ఖాళీ క్రీడల్లోనే ఒలింపిక్స్‌ను నిర్వహిస్తున్నారు. కరోనా కేసులు రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతుండడంతో ప్రేక్షకులకు అనుమతి ఇవ్వడం లేదు.
First Batch of Indian Athletes land in Tokyo