అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నరసరావుపేటలో బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారికి పచ్చి కోడి మాంసం తినడం అలవాటు ఆమెకు రోగనిరోదక శక్తి తక్కువ ఉండడంతో మృతి చెందిందని వైద్యులు తెలిపారు. బర్డ్‌ఫ్లూతో మృతిచెందినట్టు ఐసిఎంఆర్ నిర్ధారించింది. బర్డ్‌ఫ్లూ తో చిన్నారి చనిపోవడంతో ఎపి ప్రభుత్వ అప్రమత్తమైంది. బర్డ్ ప్లూ మనుషులు మృతి చెందడం తొలి సారిక కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అలెర్ట్ చేసింది. వైద్యాధికారులు తెలిపిన వివరాల ప్రకారం… పిబ్రవరి 26న బాలిక కుటుంబ సభ్యులు చికెన్ తీసుకరావడంతో ఆమె పచ్చి మాంసం తిన్నది. ఫిబ్రవరి 28 బాలి జ్వర లక్షణాలు కన్పించడంతో ఆస్పత్రికి తరలించారు. జరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో ముక్కు కారడం, మూర్ఛ, విరేచనాలు, ఆహారం తీసుకోలేని పరిస్థితులో ఉండడంతో బాలికను ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. బాలికకు ఆక్సిజన్ సాయంతో చికిత్స అందించారు.
మార్చి 16న చికిత్స పొందుతూ బాలిక తుది శ్వాస విడిచింది. చిన్నారి గొంతు, ముక్కు నుంచి తీసిన స్వాబ్ పరీక్షించగా ఇన్‌ఫ్లుయెంజా ఎ పాజిటివ్‌గా తేలడంతో వైద్య బృందం షాక్‌కు గురైంది. ఐసిఎంఆర్ 24న స్వాబ్ నమూనాలను పుణెలోని ఎన్‌ఐవిలో పరిశీలించగా హెచ్5ఎన్1 వైరస్‌గా నిర్థారించారు. ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి బర్డ్ ఫ్లూ సోకలేదని వైద్యులు వెల్లడించారు. కోడిమాంసం, గుడ్లను వంద డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉడికించి తినాలని వైద్యులు సూచిస్తున్నారు. జబ్బు పడిన పక్షులు, పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని వివరించారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా వుండే వృద్ధులు, పిల్లలను బర్డ్‌ఫ్లూ ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉంచాలని తెలియజేశారు. జ్వరంతో పాటు జలుబు, తీవ్రస్థాయిలో దగ్గు తదితర లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలని సలహాలు ఇచ్చారు.