ఎపిలో తొలి బ్లాక్ ఫంగస్ కేసు వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో తొలిసారిగా ఈ బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. నిడదవోలులో కోలపల్లి అంజిబాబు అనే వ్యక్లికి బ్లాక్ ఫంగస్ లక్షణాలున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. 15 రోజుల క్రితమే అంజిబాబు కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో డిశ్చార్జ్ అయిన సమయానికే ఆయన కన్ను వాచిపోయింది. గతవారం రోజులుగా కన్ను వాపు పెరుగుతూ వస్తోంది. దీంతో రాజమండ్రి, వైజాగ్ వైద్యులను ఆయన కుటుంబీకులు సంప్రదించారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలుగా వైద్యులు వీటిని ధృవీకరించారు. కన్ను, ముక్కు, మెదడుకు ఈ బ్లాక్ ఫంగస్ వ్యాపించే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరించారు. బ్లాక్ ఫంగస్ లక్షణాల కారణంగా కన్నును వెంటనే తీయాల్సి ఉంటుందని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో అంజిబాబు కుటుంబీకులు తీవ్ర ఆందోళన పడుతున్నారు.
First Black Fungus Case Reported in AP