Friday, November 22, 2024

మానవుల్లో తొలి బర్డ్‌ఫ్లూ కేసు

- Advertisement -
- Advertisement -

First case of Bird flu in Humans reported in Russia

 

మాస్కో : మానవుల్లో తొలి బర్డ్‌ఫ్లూ కేసు రష్యాలో బయటపడింది. బర్డ్‌ఫ్లూకు కారణమయ్యే ఎవియన్ ఇన్‌ఫ్లూయెంజా ఎ వైరస్ లోని హెచ్ 5 ఎన్ 8 స్ట్రెయిన్‌ను వెక్టార్ రీసెర్చి సెంటర్ శాస్త్రవేత్తలు మానవుల్లో గుర్తించారు. రష్యా దక్షిణ ప్రాంతంలో డిసెంబరులో బర్డ్‌ఫ్లూ వ్యాపించింది. ఒక పౌల్ట్రీ ఫామ్ లోని ఏడుగురు ఉద్యోగుల్లో ఈ ఫ్లూ జాతి జన్యు పదార్ధాన్ని శాస్త్రవేత్తలు వేరు చేశారు. కొద్దిపాటి వ్యాధి లక్షణాలు తప్ప ప్రస్తుతం వారంతా ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఈ వైరస్ ఉత్పరివర్తన చెందుతుందా లేదా అన్నది ఇంకా చెప్పలేమని అంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News