Saturday, January 11, 2025

తొలి ఆవుపేడ ఆధారిత బయోగ్యాస్ ప్రాజెక్ట్

- Advertisement -
- Advertisement -

First cow dung based biogas project

ప్రారంభించిన హెచ్‌పిసిఎల్

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాజస్థాన్‌లోని సంచోర్ వద్ద మొట్టమొదటి ఆవుపేడ ఆధారిత బయోగ్యాస్ ప్రాజెక్టును ప్రారంభించినట్టు ప్రభుత్వరంగ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పిసిఎల్) ప్రకటించింది. గ్రీన్ ఎనర్జీ, పర్యావరణ హిత కార్యక్రమాల్లో భాగంగా వ్యర్థాల నుంచి ఇంధన పోర్ట్‌ఫోలియో కింద హెచ్‌పిసిఎల్ తొలిసారిగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఆటోమోటివ్ ఇంధనంగా వినియోగించే బయోగ్యాస్ ఉత్పత్తి చేసేందుకు ఈ ప్లాంట్ రోజుకు 100 టన్నుల పేడను వినియోగించాలని ప్రతిపాదించింది. సంవత్సరం సమయంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని కంపెనీ నిర్ణయించింది. శ్రీ గోధాం మహతీర్థ్ పదమేద లోక్ పుణ్యార్థ్ న్యాస్ వద్ద ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో బయో ఫ్యూయెల్ ఇడి షువేందు గుప్తా, హెచ్‌పిసిఎల్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News