Tuesday, December 24, 2024

మజ్జా మజ్జా…

- Advertisement -
- Advertisement -

First day first show Cinema

వెటరన్ ప్రొడ్యూసర్ ఏడిద నాగేశ్వరరావు స్థాపించిన పూర్ణోదయ… ఇప్పుడు శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో తిరి గి నిర్మాణంలోకి వచ్చింది. మిత్రవింద మూవీస్‌తో కలి సి ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఆయన కుమారుడు ఏడి ద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సరికొత్త కామెడీ ఎంటర్ టైనర్. రాధన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి మొదటి లిరికల్ వీడియో ‘మజ్జా మజ్జా’ సాంగ్‌ని విడుదల చేసి ఆడియో ప్రమోషన్‌లను ప్రారంభించింది చిత్ర యూనిట్. హీరో తన ప్రేయసి ఉద్దేశించి పాడుకున్న ఈ పాట కాలేజీ నేపధ్యంలో క్లాస్‌గా మొదలై పెప్పీ డ్యాన్స్ నెంబర్‌గా టర్న్ తీసుకోవడం ఆసక్తికరంగా వుంది. వంశీధర్ గౌడ్ , వాసు వలబోజుల తెలంగాణ యాసలో పాటకు రాసిన సాహిత్యం క్యాచీగా వుంది. ఆంథోని దాసన్ ఫుల్ ఎనర్జిటిక్‌గా పాడిన ఈ పాటకు విశ్వ రఘు మాస్టర్ డిఫరెంట్ కొరియోగ్రఫీ అందించారు. శ్రీకాంత్ రెడ్డి తన డ్యాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకున్నాడు. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రం రైటింగ్ విభాగంలో వున్నారు. ఈ చిత్రానికి కథ అందించిన అనుదీప్… వంశీధర్ గౌడ్, కళ్యాణ్‌లతో పాటు స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఈ చిత్రానికి డైలాగ్స్‌ను అనుదీప్ కెవి, వంశీధర్ గౌడ్ రాశారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ.పి సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News