Tuesday, January 21, 2025

సరికొత్త కామెడీ ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

First day first show movie

 

ప్రతిష్టాత్మక పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అ ధినేత ఏడిద నాగేశ్వర రావు మనవరాలు శ్రీజ నిర్మాతగా శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మిస్తున్న చిత్రం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. ‘జాతి రత్నాలు’ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీకాంత్‌రెడ్డి, సం చిత ప్రధాన పాత్రలు పోహిస్తున్న ఈ చిత్రానికి వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ.పి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. సరికొత్త కా మెడీ ఎంటర్‌టైనర్‌గా సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో దర్శకులు వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ల క్ష్మీనారాయణ మాట్లాడుతూ “వంశీ, నేను చా లా అద్భుతమైన సమన్వయంతో ఈ సినిమా చేశాం.

ఇందులో హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఈ విషయం కథలో ఎంత మేరకు వాడాలో అంతవరకు వుంటుంది. ఏది వాడినా సినిమా ని వినోదాత్మకంగా చేయడానికే ప్రయత్నించాం”అని అన్నారు. వంశీ మాట్లాడుతూ “ఇందులో కథానాయకుడి పేరు శ్రీను. కాలేజీలో ఒక అమ్మాయిని ఇష్టపడుతుంటాడు. ఆ అమ్మాయి చాలా రోజుల తర్వాత శ్రీనుతో తొలిసారి మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు కావాలని అడుగుతుంది. ఆ టికెట్లు సంపాదించడానికి శ్రీను ఎలాంటి ప్రయత్నాలు, సాహసాలు చేశాడనేది ఈ సినిమాలో చాలా ఎంటర్‌టైనింగ్ వుంటుంది”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News