Monday, December 23, 2024

శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’

- Advertisement -
- Advertisement -

FIRST DAY FIRST SHOW Movie Logo released

జాతీయ స్థాయిలో పలు అవార్డులు పొంది టాలీవుడ్‌లో గర్వించే సంస్థగా పేరుపొందిన పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వర రావు మనవరాలు శ్రీజ నిర్మాతగా మారి శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో తొలి చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రానికి ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అని పేరు ఖరారు చేశారు. ఈ చిత్ర లోగోను హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఆవిష్కరించారు. ఈ చిత్రంతో ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ శిష్యులు వంశీ, లక్ష్మీనారాయణ దర్శకులుగా పరిచయం అవుతున్నారు.

ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ “ఏడిద నాగేశ్వరరావు పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ ది గేట్ జర్నీ. అలాంటి గొప్ప సంస్థ మళ్ళీ మొదలవ్వడం చాలా ఆనందంగా వుంది. శంకరాభరణం, స్వాతిముత్యం.. ఇలా చాలా క్లాసిక్ మూవీలు వారి సంస్థ నుంచి వచ్చాయి. ఇప్పుడు ఈ గొప్ప బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. నిర్మాత శ్రీజ మాట్లాడుతూ “ మా తాతగారి సినిమాలు చూసి పెరిగాం. అందుకే మంచి సినిమాలు చేయాలని ఈ బ్యానర్ స్థాపించాం. క్లాసికల్ టచ్ చేయకుండా శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఫ్యామిలీతో హాయిగా నవ్వుకునే సినిమాలు నిర్మిస్తాం”అని అన్నారు. ఈ కార్యక్రమంలో అనుదీప్, ఏడిద శ్రీరామ్, చిత్ర దర్శకులు వంశీ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేః కె.వి.అనుదీప్, వంశీ, కళ్యాణ్ సంగీతంః రథన్, కెమెరాః ప్రశాంత్ అక్కిరెడ్డి, డైలాగ్స్‌ః కె.వి.అనుదీప్, వంశీ, ఎడిటర్‌ః మాధవ్.

FIRST DAY FIRST SHOW Movie Logo released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News