Sunday, December 22, 2024

మొదటి రోజు మోకిల వేలం మోగింది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మోకిల హెచ్‌ఎండిఏ వెంచర్ ప్లాట్ల వేలానికి అమిత ఆధరణ లభిస్తోంది. మొదటి రోజు ఆన్‌లైన్ వేలంలో గజం అత్యధికంగా లక్ష రూపాయల ధర పలకడం గమనార్హం. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ) మోకిల లో చేస్తున్న భారీ వెంచర్‌లో 50 ప్లాట్లకు వేలం నిర్వహించగా అన్నింటికీ మంచి డిమాండ్ వచ్చింది. రెండో దశలో 300 ప్లాట్లను హెచ్‌ఎండిఏ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టిసి ద్వారా బుధవారం నుంచి ఐదు రోజుల పాటు ఆన్ లైన్ వేలం ప్రక్రియను నిర్వహిస్తున్నది.

బుధవారం మొదటి రోజు ఉదయం 30 ప్లాట్లకు, మధ్యాహ్నం మరో 30 ప్లాట్లకు వేలం ప్రక్రియ జరిగింది. వాటిలో అత్యధికంగా గజం లక్ష రూపాయల చొప్పున మోకిల భూముల రేటు పలకడం విశేషం. మోకిలా లే అవుట్లో తొలి రోజు గజం రేటు సరాసరిగా రూ.63,513లుగా నమోదు కావడం గమనార్హం. మొదటిరోజు 58 ప్లాట్ల అమ్మకాల ద్వారా రూ.122.42 కోట్ల రెవెన్యూ చేకూరింది. మోకిల హెచ్‌ఎండిఏ లే అవుట్ కోకాపేట్ నియో పోలీస్ లేఅవుట్ దగ్గరలో ఉండడం, ఔటర్ రింగ్ రోడ్డుకు, శంషాబాద్ విమానాశ్రయానికి అందుబాటులో ఉండడం వల్ల మంచి డిమాండ్ నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News