Thursday, January 16, 2025

భారత్ పర్యటనకు రష్యా ఫస్ట్ డిప్యూటీ పిఎం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రష్యా మొదటి ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ భారత్‌లో పర్యటించనున్నట్టుగా ఆ దేశ రాయబార కార్యాలయం ఆదివారం పేర్కొంది. ఇందులో భాగంగా నవంబర్ 11న ముంబైలో జరగనున్న రష్యన్‌ఇండియన్ బిజినెస్ ఫోరమ్ ప్లీనరీ సెషన్‌లో ఆయన పాల్గొననున్నారని తెలిపింది. ఇరుదేశాల పారిశ్రామిక వేత్తల మధ్య సహకారం,రవాణా లాజిస్టిక్స్, ఫైనాన్స్, డిజిటల్ టెక్నాలజీలు సంబంధాలను విస్తరించడమే ఈ కార్యక్రమ లక్షమని వెల్లడించింది. దీనిని బిజినెస్ కౌన్సిల్ ఫర్ కోఆపరేషన్ విత్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహిస్తోందని రాయబార కార్యాలయం పేర్కొంది.

ఈ సమావేశాల వల్ల ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. నవంబర్ 12న ఇంటర్‌గవర్నమెంటల్ రష్యన్ ఇండియన్ కమిషన్ నిర్వహించే కీలక సమావేశంలో డెనిస్ మంటురోవ్ భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో సమావేశం అవుతారని వెల్లడించింది. ఇందులో భాగంగా వాణిజ్య, ఆర్థిక , శాస్త్రీయ , సాంకేతిక, సాంస్కృతిక సహకారానికి సంబంధించిన విషయాలపై చర్చలు జరుగుతాయని తెలిపింది. భారత పర్యటనలో భాగంగా రష్యా ఉపప్రధాని ఇతర ద్వైపాక్షిక సమావేశాల్లోనూ పాల్గొంటారని రాయబార కార్యాలయం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News