న్యూఢిల్లీ: ఈ నెల 3వ తేదీ నుంచి 15 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు కొవిడ్–19 వ్యాక్సిన్ ప్రారంభించగా ఇప్పటివరకు మూడు కోట్ల మందికిపైగా పిల్లలు మొదటి డోసు వ్యాక్సిన్ వేసుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవీయ గురువారం తెలిపారు. దేశ యువజనులు ఎంతో బాధ్యతగా, ఉత్సాహంతో వ్యాక్సినేషన్‌లో పాల్గొంటున్నారని ఆయన ప్రశంసించారు. సాధ్యమైనంత త్వరగా దేశంలోని అర్హులైన యువజనులందరూ వ్యాక్సినేషన్‌లో పాల్గొనాలని ఆయన ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా&ఇప్పటివరకు 26,73,386 మంది ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లకు పైబడిన వారు, వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వ్యాక్సిన్ బూస్టర్ డోసు వేసుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో మరో 76 లక్షల డోసుల వ్యాక్సినేషన్ జరగడంతో దేశంలో ఇప్పటి వరకు 154.61 కోట్ల డోసుల కొవిడ్-19 వ్యాక్సినేషన్ జరిగినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.
3 కోట్ల మంది పిల్లలకు మొదటి డోసు వ్యాక్సినేషన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -