Monday, December 23, 2024

తొలి ఏకాదశి ప్రవిత్రమైన రోజు

- Advertisement -
- Advertisement -

బాన్సువాడ: హిందూ సాంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి పవిత్రమైన రోజని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం తొలి ఏకాదశి సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని శాంతినగర్‌లోని రుక్మిణి సమేత పాండురంగ విఠలేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం అధ్యాత్మికంగా పూజలు చేస్తుంటే, ఇవి ఏదో రకంగా మనకు సహాయపడతాయన్నారు.

ఇటీవల మహారాష్ట్ర పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పండరీపూర్ విఠలేశ్వర స్వామిని దర్శించు కున్నార న్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని 32 ఆలయాల అర్చకులకు కొత్తగా దూప దీప నైవేద్యం కింద వేతనం మంజూరైందన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి అర్చకులకు నెలకు రూ. 10 వేలు అందుతాయన్నారు. అర్చకులు పేదవారని, ఈ వేతనం వారి కుటుంబానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఎర్వల కృష్ణారెడ్డి, ప్రజా ప్రతినిధులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News