Wednesday, January 22, 2025

రంగనాథస్వామి ఆలయంలో తొలి ఏకాదశి మహోత్సవాలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : ఖమ్మం నగరంలోని త్రీటౌన్ రంగనాయకుల గుట్టపై గల శ్రీలక్ష్మీ రంగనాథ స్వామి వారి ఆలయంలో తొలి ఏకాదశి సందర్బంగా 3వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాలు గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా శ్రీస్వామివారికి నవకలశాలతో ప్రత్యేక అభిషేకం, అర్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నీలం అనంతకుమార్ దంపతులచే సుందర్శనహోమం తదితర కార్యక్రమాలను ఆలయ అర్చకులు ఆచార్య సాందీప్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలి పండుగ కావటంతో భక్తులు అభ్యంగన స్నానాలు చేసి శ్రీస్వామివారిని పెద్ద ఎత్తున దర్శనం చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు బూరుగడ్డ శ్రీధరాచార్యులు, శ్రీరంగనాధ భక్త మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఖమ్మంనగరంలోని వలు వైష్ణవాలయాల్లో గురువారం తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. ఉదయం నుండే ఆలయాల్లో భక్తులు సందడి చేసారు. పేలప్పిండిని ప్రసాదంగా స్వీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News