Tuesday, November 5, 2024

యాదాద్రిలో వైభవంగా తొలి ఏకాదశి స్వాతి నక్షత్రపూజలు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో తొలి ఏకాదశి, శ్రీవారి జన్మనక్ష్రతం స్వాతి నక్షత్ర పూజలు, అష్టోత్తర శతఘటాభిషేకాన్ని శాస్త్రోక్తంగా వేదపండితులు నిర్వహించారు. గురువారం స్వాతినక్షత్రం సందర్భంగా స్వామివారి భక్తుల గిరి ప్రదక్షిణలతో ఆలయ పరిసరాలు, కొండకింద లక్ష్మీనారసింహుడి నామస్మరణ మారుమోగింది. పాతగుట్ట ఆలయంలోనూ స్వాతి నక్షత్రం, తొలిఏకాదశి పూజలతో శ్రీలక్ష్మీనరసింహుడికి ఉత్సవ మహోత్సవాల శోభ నెలకొంది. జన్మనక్షత్రం స్వాతి పురస్కరించుకొని యాదాద్రి ఆలయ ంలో శ్రీ స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు.

ఆలయంలో ఉదయం అర్చకులు ప్రత్యేక పూజలతో పాటు శ్రీ స్వామి వారికి శతఘటాభిషేకం పూజలను 108 కలుశాలతో నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహుని మంత్ర జలములతో అర్చకులు అభిషేకించి పూజలు చేయగా భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులు, స్థానికులు తెల్లవారుజాము నుండే యాదాద్రి కొండ చూట్టు శ్రీనరసింహ స్వామి నామస్మరణ చేస్తూ గిరిప్రదక్షిణ చేశారు. తెల్లవారుజామున ఆలయం తెరచి సుప్రభాత సేవ నుండి రాత్రి పవళింపు సేవ వరకు ఆలయంలో జరుగు నిత్యపూజలు అభిషేకం, అర్చన, నిత్యకల్యాణం, సువర్ణ పుష్పార్చన, వెండి జోడిసేవ తదితర పూజలో భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు.

లక్ష పుష్పార్చన..
తొలి ఏకాదశి పర్వదినం సందర్బంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం శ్రీలక్ష్మీనరసింహునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీ స్వామి అమ్మవారులు లక్షపుష్పర్చన పూజను వైభవంగా నిర్వహించగా భక్తులు,స్థానికులు పాల్గొని దర్శించుకున్నారు. వివిధ రంగుల పుష్పలతో శ్రీవారి నామస్మారాలతో వేద మంత్రోచ్చరణ గావిస్తూ శాస్రోక్తంగా పుష్పర్చన పూజలు గావించగా భక్తులు దర్శించుకున్నారు.

శ్రీవారి నిత్యరాబడి…
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిత్యరాబడిలో భాగంగా గురువారం రూ.49,19,117 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.6,39,700, బ్రేక్ దర్శనం ద్వారా రూ.3,25200, వీఐపీ దర్శనం ద్వారా రూ.2,40,000, కొండపైకి వాహనాల ద్వారా రూ.4,50,000, ప్రసాద విక్రయం ద్వారా రూ.12,93,100, తదితర శాఖల నుంచి ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
స్వామి వారిని ప్రముఖులు దర్శించుకుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారిని దర్శించుకునన్నవారిలో తెలంగాణ ప్రభుత్వం మహిళ కమిషనర్ చైర్ పర్సన్ సునీత లకా్ష్మరెడ్డి కుటుంబ సమేతంగా, వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ గండ్ర జ్యోతి,జాతీయ సంచార జాతుల అభివృదద్ది సంక్షేమ బోర్డు సభ్యుడు నరసింహ,ఢీల్లి (ఐపిఎస్) డిజిపిలు రాజేష్‌కుమార్,గరిమా భట్నాగర్, ప్రభుత్వవిప్, శేర్లింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కుటుంబ సభ్యులతో శ్రీ స్వామివారి దర్శించుకొని పూజలు చేయగా ఆలయ అర్చకులు ప్రకుఖులకు ఆశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదమును అందచేశారు.

స్వామి వారికి వెండి కలశాల అందచేసిన భక్తులు
శ్రీలక్ష్మీనరసింహ స్వామివారికి యాదగిరిగుట్టకు చెందిన గౌళికర్ కుటుంబికులు ఆరు వెండి కలుశాలను శ్రీ స్వామివారికి బహుకరించారు, 2,50,000 లక్షల రూపాయల విలువ గల వెండి కలశాలు గౌళికర్ నర్సోజి జ్ఞాపకార్ధం అందచేసినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News