Monday, January 20, 2025

అంతరిక్షంలో చిత్రీకరించిన తొలి చలన చిత్రం ‘ది ఛాలెంజ్’ విడుదల

- Advertisement -
- Advertisement -
మొదటి వారంలోనే 5.5 మిలియన్ డాలర్లు వసూలు
చిత్ర దర్శకుడు, నటుడు గత ఏడాది అక్టోబర్‌లో అంతరిక్ష కేంద్రంలో సన్నివేశాలను చిత్రీకరించారు.

మాస్కో: అంతరిక్షంలో తీసిన తొలి చిత్రం ‘ది ఛాలెంజ్’ రష్యాలో గత వారం విడుదలయింది. ఈ సంవత్సరం జనవరిలో చిత్రం యొక్క ‘జీరో గ్రావిటీ ట్రైలర్’ విడుదలయింది. ఈ చిత్రం విడుదలైన మొదటి వారంలోనే 445 మిలియన్ రూబుళ్లు (సుమారు 5.5 మిలియన్ అమెరికా డాలర్లు) వసూలు చేసింది. కలెక్ట్ స్పేస్ ఈ వివరాలు వెల్లడించింది.

చలన చిత్ర దర్శకుడు క్లిమ్ షిపెంకో, నటి యులియా పెరెస్టిల్ గత ఏడాది అక్టోబర్‌లో రష్యన్ సోయుజ్ అంతరిక్ష నౌకలో ఫ్లయింగ్ లాబొరేటరీకి బయలుదేరడంతో అంతరిక్షంలో చిత్రం చిత్రీకరించబడుతుంది. వారు మూడు అంతరిక్ష యాత్రలలో అనుభం గడించిన కాస్మోనాట్ అంటోన్ ష్కప్లెరోవ్‌తో కలిసి అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. సన్నివేశాలను చిత్రీకరించిన తర్వాత భూమికి తిరిగి రావడానికి ముందు వారు దాదాపు 12 రోజులపాటు ఫ్లయింగ్ లాబొరేటరీలో ఉన్నారు.

‘ది ఛాలెంజ్ ’ని మొదటి అంతరిక్ష చిత్రంగా అభివర్ణిస్తున్నారు. రష్యన్ మీడియా దీన్ని ఓ అద్భుత ఘనతగా చాటుకుంటోంది. ప్రపంచాన్ని ఓడించిన ఘనతగా చెప్పుకుంటోంది.

ఈ చిత్రం ఒక కాస్మోనాట్ ప్రాణాలను రక్షించడానికి చిన్న నోటీసుపై ఇంటర్నెషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్‌స్)కి వెళ్లే వైద్యుడి నేపథ్యంతో ఉంటుంది. ‘ప్రతి సెకండ్ ఓ పెద్ద ఆవిష్కరణ’ అని చిత్రంలో డాక్టర్ నటించిన పెరెసిల్డ్ అన్నారు.
కలెక్ట్ స్పేస్ ప్రకారం, సోవియట్ వ్యోమగామి యూరి గగారిన్ 62వ వార్షికోత్సవం సందర్భంగా మాస్కోలోని స్టేట్ క్రెమ్లిన్ ప్యాలెస్‌లో ఈ చిత్రం యొక్క ప్రత్యేక ప్రదర్శన వేశారు. రోస్కోస్మోస్ వ్యోమగాములైన అంటోన్ ష్కప్లెరోవ్, ఒలేగ్ నోవిట్సీ, పెరెసిల్డ్, షిపెంకోతో కలిసి అక్టోబర్ 2021లో ప్రారంభించి, ల్యాండ్ అయిన వారు కూడా ఈ స్క్రీనింగ్‌కు హాజరయ్యారు.

The challenge2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News