మహిళల 400 మీటర్ల టి20 కెటగిరిలో దీప్తికి మొదటి స్థానం
అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలు
కోబె(జపాన్) : వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాం పియన్ షిప్ పోటీల్లో భారత క్రీడాకారిణి సత్తా చాటింది. సోమవారం జరిగిన మహిళల 400 మీటర్ల టి20 కెటగిరీలో భారత్‌కు చెందిన దీప్తి జీవన్‌జీ 55.07 సెకెన్లలో పూర్తి చేసి స్వర్ణం కైవసం చేసుకుంది. ఇక క్వాలీఫైయింగ్ దశలో జీవన్‌జీ మహిళల 400 మీట ర్ల టి20 విభాగంలో కేవలం 56.18 సెకెన్లలోనే చేరుకొని ప్రపంచ రికార్డు సృష్టించి, ఫైనల్లో అడుగు పెట్టింది.
గత ఏడాది పారిస్ లో జరిగిన ఛాంపియన్‌షిప్స్‌లో అమెరికాకు చెందిన బ్రెన్నా క్లార్క్ 55.12 సెకన్ల ప్రపంచ రికార్డును దీప్తి బద్దలు కొట్టింది. నాలుగో రోజు పోటీల్లో టర్కీకి చెందిన ఐసెల్ ఒండర్ 55.19 సెకన్లతో రెండో స్థానంలో ఉండగా, ఈక్వెడార్‌కు చెందిన లిజాన్‌షెలా అంగులో 56.68 సెకన్లతో మూడో స్థానంలో నిలిచారు. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ట్రాక్ ఈవెంట్‌లలో భారత్‌కు తొలి స్వర్ణం లభించింది.
అంతకుముందు పారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో, మహిళల 200 మీటర్ల టి35 విభాగంలో భారత్‌కు చెందిన ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. పురుషుల ఎఫ్56 విభాగంలో డిస్కస్ త్రోలో యోగేష్ కతునియా 41.80 మీటర్లు ఎగసి రజతం సాధించాడు. ఆదివారం నిషాద్ కుమార్ (టి47 హైజంప్)లో కాంస్యని గెలుపొందాడు. దీనితో ప్రస్తుతం భారత్ ఖాతాలో 1 స్వర్ణం, 1 రజతం, 2 కాంస్యాలతో నాలుగు పతకాలు పొందారు.