Monday, December 23, 2024

మెదక్ రైల్వే స్టేషన్‌కు మొదటి గూడ్స్ రైలు

- Advertisement -
- Advertisement -

First goods train to Medak railway station

మనతెలంగాణ/హైదరాబాద్ : మొట్టమొదటి గూడ్స్ రైలు మెదక్ రైల్వే స్టేషన్‌లోకి సోమవారం వచ్చింది. ఇటీవలే అక్కన్నపేట్- మెదక్ సెక్షన్ నుంచి నడిపిన మొట్టమొదటి సరుకుల రైలు ఇదేనని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. సరుకుల రవాణా జరిపేందుకు వీలుగా ఇటీవల జూలై నెలలో మెదక్ గూడ్స్ షెడ్డు నుంచి సరుకుల రవాణా జరపనున్నట్లు అధికారులు ప్రకటించారు. అందులో భాగంగా సోమవారం 15 మూసిన పైకప్పుతో ఉన్న వ్యాగన్లు (బిసిఎన్) కాకినాడ నుంచి మెదక్‌కు వచ్చాయి. దాంతో మెదక్ స్టేషన్‌లో సరుకుల రవాణా పనులు మొదలయ్యాయి. మొట్టమొదటి గూడ్స్‌లో 948 టన్నుల ఎరువులను తీసుకు వచ్చారని అధికారులు తెలిపారు.

948 టన్నుల ఎరువులు గూడ్స్‌లో…

కొత్త రైల్వే లైను ప్రాజెక్టు అక్కన్నపేట్ – మెదక్ సెక్షన్‌లో నిర్మించిన మెదక్ రైల్వేస్టేషన్ తెలంగాణ బోర్డర్‌లో చివరిస్టేషన్. అక్కన్నపేట్ -టు మెదక్‌ల మధ్య నిర్మించిన కొత్త రైల్వే లైను మధ్య దూరం 17 కిలోమీటర్లు కాగా దీనిని ఈ ఏడాది మార్చిలో పూర్తి చేశారు. ఆ తరువాత మెదక్ స్టేషన్ నుంచి సరుకుల రవాణా జరపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. మొదటి గూడ్స్ రైలులో కాకినాడ మెస్సర్స్ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ సైడింగ్ నుంచి పంపిన 948 టన్నుల ఎరువులు సోమవారం మెదక్ స్టేషన్‌కు వచ్చాయి. మొదటి గూడ్స్ ప్రయాణించిన దూరం దాదాపు 500 కిలోమీటర్లు అని అధికారులు తెలిపారు. సరుకుల రవాణాకు అనువుగా మెదక్ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేసిన హైదరాబాద్ డివిజన్‌ను, నిర్మాణ సంస్థను వారి బృందాలను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇంచార్జి) అరుణ్ కుమార్ జైన్ అభినందించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News