- Advertisement -
అమరావతి: ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యంతో తిరుపతిలో రూ. వెయ్యి కోట్లతో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఏర్పాటు చేశామని సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుపతిలో మొట్టమొదటిసారిగా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లాంట్ నిర్వాహకులతో సిఎం చర్చించారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అందులో ఇలా రాసుకొచ్చారు. ‘‘ భారతదేశంలో క్లీన్ ఎనర్జీ భవిష్యత్తు కోసం ఆంధ్ర ప్రదేశ్ ఒక ధైర్యమైన దృష్టిని కొనసాగిస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ సాంకేతికత కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఎపిని కేంద్రంగా చేసే లక్ష్యానికి ఇది తొలి అడుగు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
- Advertisement -