Sunday, December 22, 2024

145 మందితో బయలుదేరిన హజ్- 2022 తొలి విమానం

- Advertisement -
- Advertisement -

First Hajj 2022 flight with 145

శ్రీనగర్ : హజ్ యాత్ర మొదలైంది. హజ్ 2022 తొలి విమానం శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆదివారం నాడు సౌదీ అరేబియాకు బయలు దేరింది. 145 మంది యాత్రికులు ఇందులో ప్రయాణించారు. ఏటా జరిగే ఈ హజ్ యాత్ర గత రెండేళ్లుగా కొవిడ్ మహమ్మారి కారణంగా రద్దయింది. ఇప్పుడు జూన్ 20 వరకు మొత్తం 5737 మంది హజ్ విమానాల్లో సౌదీ అరేబియాకు వెళ్లారు. ఈ నెల 12 న రెండు హజ్ విమానాలు నడుస్తాయని, 13 నుంచి ప్రతిరోజూ 3 హజ్ విమానాలు శ్రీనగర్ నుంనచి మదీనా వెళ్తాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News