Monday, January 20, 2025

బంగ్లాదేశ్‌లో విడుదలవుతున్న తొలి హిందీ చిత్రం పఠాన్

- Advertisement -
- Advertisement -

 

ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటంచిన బ్లాక్‌బస్టర్ చిత్రం పఠాన్ ఈనెల 12న బంగ్లాదేశ్‌లో విడుదలవుతోంది. 1971 తర్వాత బంగ్లాదేశ్‌లో విడుదలవుతున్న మొట్టమొదటి హిందీ చిత్రం ఇదే కావడం విశేషం.
వివిధ దేశాలు, జాతులు, సంస్కృతులను ఏకం చేయగల ఏకైక శక్తి సినిమాకే ఉందని, ప్రజలను దగ్గరకు చేర్చడంలో సినిమాకు ఎప్పుడూ ప్రత్యేక స్థానముందని అంతర్జాతీయ పంపిణీ సంస్థ వైఆర్‌ఎఫ్‌కు చెందిన స్పై యూనివర్స్ వైస్ ప్రెసిడెంట్ నెల్సన్ డిసైజా తెలిపారు.

Also Read: కేజ్రీవాల్‌పై తప్పుడు ప్రచారం

ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లు రాబట్టిన పఠాన్ ఇక బంగ్లాదేశ్ ప్రేక్షకులను అలరించనున్నదని ఆయన అన్నారు. 1971 తర్వాత బంగ్లాదేశ్‌లో విడుదలవుతున్న తొలి హిందీ చిత్రంగా పఠాన్ చరిత్రలో నిలిచిపోతుందని ఆయన అన్నారు. ఇందుకు పాలకులకు ఆయన కృతజతలు తెలిపారు. బంగ్లాదేశ్‌లో కూడా షారుఖ్ ఖాన్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News