Monday, December 23, 2024

ఎన్‌బికె 107 ఫస్ట్ హంట్ లోడింగ్

- Advertisement -
- Advertisement -

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్‌లో ఓ మాస్ మసాలా ఎంటర్‌టైనర్ రూపుదిద్దుకుంటోంది. ‘ఎన్‌బికె 107’ వర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం నుండి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ హంట్ విడుదల కానుంది. ‘ఎన్‌బికె 107 ఫస్ట్ హంట్ లోడింగ్’ అని బాలకృష్ణ చేతులను మాత్రమే చూపిస్తున్న పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ఫస్ట్ హంట్ ని ప్రకటించింది. బాలకృష్ణ పుట్టిన రోజు కానుక గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ సినిమాతో విలన్‌గా టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

First Hunt loading from ‘NBK107’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News