Wednesday, January 22, 2025

అమెరికా జిల్లా కోర్టు మొదటి జస్టిస్‌గా ఇండియన్-అమెరికన్ మహిళా జడ్జి

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికా మసాచుసెట్స్ రాష్ట్రంలోని అయెర్ జిల్లా కోర్టు మొదటి జస్టిస్‌గా ఇండియన్ అమెరికన్ మహిళా జడ్జి తేజల్ మెహతా ఈనెల 2 మంగళవారం ఎంపికయ్యారు. గురువారం ప్రధాన ప్రమాణస్వీకారం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంపై నిజమైన ప్రభావం చూపుతానని, ప్రజలను దయతో చూస్తానని హామీ ఇచ్చారు. అదే అయెర్ జిల్లా కోర్టులో తేజల్ మెహతా అసోసియేట్ జస్టిస్‌గా పనిచేశారు. ఏకగ్రీవంగా ఆమె ఈనెల 2 న ఎంపికైన తరువాత జిల్లాకోర్టు చీఫ్‌జస్టిస్ స్టేసీ ఫోర్టెస్ ప్రమాణస్వీకారం చేయించారు. ఆమె నాయకత్వంలో ఈ జిల్లా కోర్టుకు మరింత ఉత్తమ సేవలు అందుతాయన్న నమ్మకం తనకు ఉందని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తేజల్ మెహతా మాట్లాడుతూ న్యాయవాదిగా ఒక స్థాయివరకే ప్రజలకు సహాయం చేయగలుగుతారని, జడ్జిగా ఇంచా చాలా చేయడమౌతుందని, సమస్యల మూలాల్లోకి వెళ్లి పరిష్కరించ గలుగుతారని తేజల్ మెహతా పేర్కొన్నారు.

అయెర్ కోర్టుకు మొదటి జస్టిస్‌గా ఐదేళ్ల పాటు పనిచేసిన జడ్జి మార్గరెట్ గుజ్‌మన్ మాట్లాడుతూ కోర్టు మొదటి జస్టిస్‌గా మెహతాను ఎంపిక చేయడాన్ని ప్రశంసించారు. ఆమె చాలా గట్టి నిర్ణయాలు తీసుకుని ఆచరించగలుగుతారని పేర్కొన్నారు..ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో మెహతా కుటుంబీకులు మెహతా 14 ఏళ్ల కుమార్తె మేనా షేత్ తోసహా అనేక మంది పాల్గొన్నారు. కంకార్డ్‌కు చెందిన మెహతా మిడిల్‌సెక్స్ జిల్లా అటార్నీ కార్యాలయం ప్రాసిక్యూటర్ కాడానికి ముందు సివిల్ వర్క్‌తో తన కెరీర్ ప్రారంభించారు. అక్కడ దశాబ్దం పాటు పనిచేశారు. బెంచ్‌కు సర్కూట్ జడ్జి కావడానికి ముందు మెహతా స్వయంగా ప్రాక్టీస్ ప్రారంభించి ప్రజల పక్షాన న్యాయవాదిగా పేరు గడించారు. సమాజంపై సానుకూల ప్రభావం చూపించాలన్నదే ఆమె లక్షంగా పెట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News