Friday, November 22, 2024

నేవీకి చేరిన విమాన వాహక నౌక విక్రాంత్..

- Advertisement -
- Advertisement -

First Indigenous Aircraft Carrier Vikrant delivered to Navy

నేవీకి చేరిన విమాన వాహక నౌక విక్రాంత్
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మాణం

న్యూఢిల్లీ: పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన విమాన వాహక నౌక విక్రాంత్‌ను భారతీయ నౌకాదళం గురువారం కోచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డు లిమిటెడ్(సిఎస్‌ఎల్) నుంచి సీకరించింది. భారతీయ నౌకాదళానికి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ రూపకల్పన చేసిన ఈ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ను సిఎస్‌ఎల్ నిర్మించింది. 1971 యుద్ధలో కీలక భూమిక పోషించిన భారతదేశ తొలి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్‌ఎస్ విక్రాంత్ పేరునే దీనికి పెట్టారు. భారతదేశ 75వ స్వాతంత్య్ర వేడుకలను ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట నిర్వహించకుంటున్న సందర్భంగా తీర ప్రాంత భద్రతను మరింత పటిష్టపరిచే పూర్తి స్వదేశీ విమాన వాహకనౌకగా విక్రాంత్ రూపొందడం గర్వకారణమని భారతీయ నౌకాదళం ఒక ప్రకటనలో తెలిపింది. 262 మీటర్ల పొడవైన ఈ విమాన వాహకనౌక దాదాపు 45,000 టన్నుల బరువు ఉంటుంది. నాలుగు గ్యాస్ టర్బయిన్లతో 88 మెగావాట్ల శక్తితో పనిచేసే ఈ నౌక గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో నడవగలదు. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ. 20,000 కోట్లు ఖర్చయింది.

First Indigenous Aircraft Carrier Vikrant delivered to Navy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News