మనతెలంగాణ/హైదరాబాద్ : ఉస్మానియా జనరల్ ఆసుపత్రి మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. హెమాంజియోమ(రక్త నాళాల కణతి)తో బాధపడుతున్న మల్లెల వాణీ(31) అనే మ హిళకు వైద్యులు విజయవంతంగా లాపరోస్కోపి హెపటెక్టోమీ సర్జరీ నిర్వహించి కొత్త జీవితం ప్ర సాదించారు. శరీరంలో కాలేయ భాగంలో ఏర్పడిని రక్తనాళాల కణతిని లాపరోస్కోపిక్ కీ హోల్ శస్త్రచికిత్స ద్వారా దానిని తొలగించారు. దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ఆపరేషన్ తొలిసారిగా ఉస్మానియాలో నిర్వహించినట్లు వై ద్యులు వెల్లడించారు. రూ. 5లక్షల నుంచి రూ. 8లక్షల వరకు ఖర్చయ్యే ఈ చికిత్సను ఉచితంగా నిర్వహించినట్లు వారు తెలిపారు.
ఉస్మానియా ఆసుపత్రి సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ సిహెచ్ మధుసూదన్ నేతృత్వంలో డా క్టర్ పాండు నాయక్, డాక్టర్ పావని, డాక్టర్ జ్యో తి, డాక్టర్ మాధవి, డాక్టర్ హైఫజుర్ రెహ్మాన్, డా క్టర్ ఆనంద్, డాక్టర్ సుదర్శన్, డాక్టర్ ఆదిత్య, డా క్టర్ వరుణ్, డాక్టర్ వేణు, సిబ్బంది సునీత సరళ మాధవి, సూర్య ప్రకాష్ కృష్ణలతో కూడిన వైద్యబృందం లాపరోస్కోపిక్ కీ హోల్ శస్త్రచికిత్స ద్వా రా విజయవంతంగా కణితిని తొలగించారు. ఈ సర్జరీ నిర్వహించేందుకు వైద్యులు ఎనిమిదిన్నర గంటలు శ్రమించారని మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్ తెలిపారు.