రంగారెడ్డి: దేశంలోనే రూ.100 కోట్ల పెట్టుబడితో తొలి ఎల్‌ఇడి టివి ప్లాంట్ ను ఏర్పాటు చేశామని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. రావిరాలలో రేడియంట్ ఆప్లయేన్సెస్, ఎలక్ట్రానిక్స్ యూనిట్‌ను మంత్రి కెటిఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ ప్రసంగించారు. తెలంగాణలో 50 లక్షల టివిలు తయారు చేయడం గొప్ప విషయమన్నారు. నెలకు నాలుగు లక్షల టివిలు తయారు చేసే స్థాయికి కంపెనీ ఎదిగిందన్నారు. కంపెనీ ద్వారా దాదాపు ఐదు వేల మందికి పైగా ఉపాధి లభిస్తోందన్నారు. ప్యాబ్‌సిటీలో 6-7 ఏళ్లుగా వేల పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 15 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ఏడాదిలోగా 45 వేల మంది ఉపాధి లభిస్తుందన్నారు. వచ్చే పదేళ్లలో ఎలక్ట్రానిక్ రంగంలో రూ.2.5 లక్షల కోట్ల ఆదాయమే లక్షంగా ముందుకు వెళ్తున్నామన్నారు. తెలంగాణలో విద్యుత్ సమస్యలేదని, మంచినీటి సమస్య లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి రంజిత్ రెడ్డి, జడ్‌పి చైర్‌పర్సన్ అనితా రెడ్డి, ఐటి శాఖ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు.
రూ.100 కోట్ల పెట్టుబడితో తొలి ఎల్‌ఇడి టివి ప్లాంట్: కెటిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -