Sunday, January 19, 2025

ఓ అందగత్తె ప్రేమ కథ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చిగురుపాటి క్రియేషన్స్ బ్యానర్‌పై ఎం.ఎస్.చంద్ర, హరిలు హీరోలుగా అక్షఖాన్ హీరోయిన్‌గా చిగురుపాటి సుబ్రమణ్యం రచన, సాహిత్యం, స్క్రీన్‌ప్లేతో స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘నెల్లూరి నెరజాణ’. ‘ఓ అందగత్తె ప్రేమకథ’ అనేది ట్యాగ్‌లైన్. 175 మందికి పైగా కొత్త వారితో, ఐదుగురు ప్యాడింగ్ ఆర్టిస్ట్‌లతో నిర్మించిన ఈ చిత్రం టీజర్, ఫస్ట్‌లుక్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ముఖ్య అతిథిగా విచ్చేసి టీజర్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం నాగ్ అశ్విన్ మాట్లాడుతూ “చిగురుపాటి సుబ్రమణ్యం నా దగ్గర ఓ వెబ్ సిరీస్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు.

ఈ సినిమాను తెరకెక్కించటానికి చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా మంచి విజయం సాధించి అందరికీ గొప్ప లైఫ్‌ను ఇవ్వాలని కోరుకుంటున్నా”అని అన్నారు. దర్శక, నిర్మాత చిగురుపాటి సుబ్రమణ్యం మాట్లాడుతూ “సినిమా అంతా నెల్లూరు యాసలో సాగుతుంది. మొత్తం 5 పాటలు, 6 ఫైట్‌లు ఉంటాయి. ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ తమ స్వంత సినిమాగా భావించి పనిచేశారు. ఇంతమంది ఇంత ప్రేమతో చేసిన ఈ ‘నెల్లూరి నెరజాణ’ను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం నాకుంది”అని తెలిపారు. ఈ వేడుకలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ, హీరోలు ఎం.ఎస్.చంద్ర, హీరో హరి, హీరోయిన్ అక్షఖాన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News