Sunday, January 19, 2025

‘ఫస్ట్ లవ్’ బ్యూటీఫుల్‌గా ఉందిః ఎస్‌ఎస్ తమన్

- Advertisement -
- Advertisement -

దీపు జాను, వైశాలిరాజ్ లీడ్ రోల్స్‌లో బాలరాజు ఎం డైరెక్ట్ చేసిన బ్యూటీఫుల్ మ్యాజికల్ ఆల్బం ’ఫస్ట్ లవ్’. వైశాలిరాజ్ నిర్మించిన ఈ ఆల్బం టీజర్ భారీ అంచనాలను సృష్టించింది. తాజాగా సెన్సేషనల్ కంపోజర్ ఎస్‌ఎస్ తమన్ ఫస్ట్ లవ్ సాంగ్‌ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ఎస్‌ఎస్ తమన్ మాట్లాడుతూ “ఫస్ట్ లవ్ మ్యూజిక్ వీడియో చాలా బ్యూటీఫుల్‌గా వుంది. సాంగ్ లో ఒక అద్భుతమైన కథ చూపించారు. ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది”అని అన్నారు. హీరోయిన్, ప్రొడ్యూసర్ వైశాలిరాజ్ మాట్లాడుతూ మేము చాలా కష్టపడి ప్రేమతో ఈ పాట చేశామని తెలిపారు. డైరెక్టర్ బాలరాజు మాట్లాడుతూ “అందరూ సెలబ్రేట్ చేసుకునే చాలా స్పెషల్ ఆల్బం ఇది. దీపు, వైశాలిరాజ్ అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరో దీపు జాను పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News