Friday, December 20, 2024

కల్కి నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోంది?

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథాలాజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి2898 ఏడి. దీపికా పదుకునే, దిశా పటాని ఫిమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ఈ నెలాఖరులో రిలీజ్ కానుంది. దీనిపై మేకర్స్ నుండి త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి తన పార్ట్ డబ్బింగ్‌ను దీపికా పదుకునే పూర్తి చేసినట్లు తెలిసింది. హిందీ, కన్నడ భాషల్లో డబ్బింగ్ ను చెప్పినట్లు సమాచారం. ఇక వచ్చే నెల 27న రిలీజ్ కానున్న ప్రభాస్ ‘కల్కి’ సినిమాపై ఇప్పుడు జపాన్‌లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. కల్కి సినిమాకి రికార్డు స్థాయి కలెక్షన్స్ వస్తాయని అంచనా ఉంది. 2017లో జపాన్‌లో ‘బాహుబలి’ రిలీజవగా.. అక్కడ దాదాపు 1 మిలియన్ యూ.ఎస్.డిలను వసూలు చేసి రికార్డు సృష్టించింది. కాగా కల్కి సినిమా ఆ రికార్డ్ అన్నింటినీ బ్రేక్ చేసే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News