హైదరాబాద్ : దేశానికి స్వాతంత్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. అందులో భాగంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారని అన్నారు. దేశంలోనే తొలిసారిగా సామూహిక గీతాలాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి తెలంగాణ వ్యాప్తంగా ఒకే సమయంలో సామూహిక గీతాలాపన చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. హైదరాబాద్‌లోని కవాడిగూడలో నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో సునీతా లకా్ష్మరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆమె తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను కోరుతూ చేపట్టే ప్రతి కార్యక్రమంలో తెలంగాణ మహిళా కమిషన్ తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తోందన్నారు.
దేశంలోనే తొలిసారిగా సామూహిక గీతాలాపన : సునీతా లక్ష్మారెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -